Raghu Rama Krishna Raju: చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల భేటీ శుభ పరిణామం: రఘురామకృష్ణరాజు

The meeting of Chandrababu and Pawan Kalyan is a good development says Raghu Rama Krishna Raju
  • శత్రువును ఎదుర్కోవడానికి మంచి నిర్ణయాలు అవసరమన్న రఘురాజు
  • లోకేశ్ పాదయాత్ర సక్సెస్ అయిందని ప్రశంస
  • యువగళం విజయోత్సవ సభకు పవన్ కల్యాణ్ వస్తారని వ్యాఖ్య

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ సమావేశం కావడం శుభ పరిణామమని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఉమ్మడి శత్రువును ఎదుర్కోవడానికి మంచి నిర్ణయాలు అవసరమని... దీనికి కావాల్సిన కార్యాచరణను చంద్రబాబు రూపొందిస్తున్నారని చెప్పారు. వీరి సమావేశంపై సాక్షి పత్రికలో ఇష్టంవచ్చినట్టు రాస్తున్నారని... ప్యాకేజీ అంటున్నారని విమర్శించారు. మీకన్నా ఎక్కువ ప్యాకేజీలు ఎవరు ఇవ్వగలరని ప్రశ్నించారు. 


లోకేశ్ పాదయాత్ర సక్సెస్ అయిందని రఘురాజు అన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ లోకేశ్ ముందుకు వెళుతున్నారని చెప్పారు. యువగళం విజయోత్సవ సభ ఎల్లుండి అద్భుతంగా జరగబోతోందని... ఈ సభకు పవన్ కల్యాణ్ తప్పకుండా వస్తారని అన్నారు. టీడీపీ, జనసేన కూటమిలోకి త్వరలోనే మరో పార్టీ కచ్చితంగా వస్తుందని జోస్యం చెప్పారు.

  • Loading...

More Telugu News