Narendra Modi: ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన మందిరాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

PM Modi inaugurates world largest meditation center in Varanasi
  • వారణాసిలో 'స్వరవేద్ మహా మందిర్ ధామ్' నిర్మాణం
  • ఏకకాలంలో 20 వేల మంది ధ్యానం చేసుకునే సదుపాయం
  • ఏడు అంతస్తుల్లో భారీ నిర్మాణం
ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యాన మందిరాన్ని నేడు ప్రారంభించారు. వారణాసిలో 'స్వరవేద్ మహా మందిర్ ధామ్' పేరిట ఈ ధ్యాన మందిరం నిర్మించారు. ఇక్కడ ఏకకాలంలో 20 వేల మంది ధ్యానం చేసుకోవచ్చు. ఈ ధ్యాన మందిరాన్ని ఏడు అంతస్తుల్లో నిర్మించారు. రామాయణ, మహాభారత కావ్యాలను ప్రతిబింబించే కళాకృతులు ఈ మహా మందిరంలో అడుగడుగునా దర్శనమిస్తాయి. 

ఈ ధ్యాన మందిరం నిర్వాహకులు స్వతంత్ర దేవ్ మహరాజ్, విజ్ఞానంద్ దేవ్ మహరాజ్ దీనికి సంబంధించిన విశేషాలను ప్రధాని మోదీకి వివరించారు. ధ్యాన మందిరం పైకప్పు కమలం ఆకృతిలో ఉండడం ప్రధాని మోదీని ఆకర్షించింది. 

ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు. యోగి ఆదిత్యనాథ్ తో కలిసి మోదీ ధ్యాన మందిరం మొత్తం కలియదిరిగారు.
Narendra Modi
Swarved Maha Mandir Dham
Meditation Center
Varanasi
BJP
Uttar Pradesh

More Telugu News