Guvvala Arrest: గువ్వల బాలరాజు అరెస్ట్

Achampet Former MLA Guvvala Balaraju Arrest
  • అచ్చంపేట వెళుతుండగా అడ్డుకున్న పోలీసులు
  • వెల్దండ వద్ద అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలింపు
  • పోలీస్ స్టేషన్ ముందు బీఆర్ఎస్ కార్యకర్తల ఆందోళన
అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ లీడర్ గువ్వల బాలరాజును పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గువ్వల బాలరాజు ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఓటమి తర్వాత తొలిసారి నియోజకవర్గానికి వస్తుండగా ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. వెల్దండ వద్ద ఆయన కారును అడ్డుకున్న పోలీసులు.. ఆయనను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

దీంతో ఆయన అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు వెల్దండ పోలీస్ స్టేషన్ కు భారీగా తరలి వచ్చారు. స్టేషన్ ముందు ఆందోళన చేస్తున్నారు. తమ నాయకుడి అరెస్టు అక్రమమని, గువ్వల బాలరాజును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నినాదాలు చేస్తూ స్టేషన్ ముందు బైఠాయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ నాయకుడిని వేధిస్తోందని, కావాలనే ఆయనను అరెస్టు చేయించిందని మండిపడుతున్నారు. దీంతో పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్తత నెలకొంది.
Guvvala Arrest
Guvvala Balaraju
Former Mla Arrest
Achampet
BRS Ex MLa
BRS

More Telugu News