Namratha: కొడుకు గౌతమ్ గురించి నమ్రత ఎమోషనల్ పోస్ట్

Mahesh Babu Wife Namratha Insta Post About Their Son Gautham
  • కుటుంబానికి దూరంగా మహేశ్ బాబు తనయుడు
  • ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళుతున్నట్లు వెల్లడి
  • ఇన్ స్టాలో పోస్ట్ చేసిన నమ్రత.. ఆల్ ది బెస్ట్ చెబుతున్న ఫ్యాన్స్
ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళుతున్న కొడుకు గురించి మహేశ్ బాబు భార్య నమ్రత ఇన్ స్టాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. గౌతమ్ ఘట్టమనేని ఇకపై కుటుంబానికి దూరంగా ఉండబోతున్నాడని చెప్పింది. న్యూయార్క్ యూనివర్సిటీలో చేరేందుకు వెళుతున్న కొడుకు ఫొటోను షేర్ చేస్తూ.. కొత్త అధ్యాయం ప్రారంభించబోతున్నందుకు శుభాకాంక్షలు తెలిపింది. ‘నీ హార్డ్ వర్క్, ఫ్యాషన్, సంకల్పం చూస్తుంటే నాకు గర్వంగా ఉంది. నువ్వు మరింత ఎత్తుకు ఎదగాలి’ అంటూ నమ్రత కామెంట్ చేసింది.

భర్త, పిల్లలకు సంబంధించిన విషయాలను తరచుగా సోషల్ మీడియాలో పంచుకునే నమ్రత.. తాజాగా గౌతమ్ గురించి చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. అయితే, గౌతమ్ ఏం చదవబోతున్నాడు అనేది మాత్రం నమ్రత వెల్లడించలేదు. గౌతమ్ ఘట్టమనేనికి మహేశ్ బాబు అభిమానులు అభినందనలు తెలుపుతూ కామెంట్స్ పెడుతున్నారు.

Namratha
Mahesh Babu
Gautham Ghattamaneni
Newyark
Mahesh babu son

More Telugu News