Thangallapalli ZPTC: బీఆర్ఎస్‌కు తంగళ్లపల్లి జడ్పీటీసీ మంజుల దంపతుల రాజీనామా

Thangallapalli ZPTC Manjula And Her Husband Resigns To BRS
  • తంగళ్లపల్లి నుంచి రెండుసార్లు జడ్పీటీసీగా గెలుపొందిన మంజుల
  • జిల్లా క్రికెట్ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా ఉన్న ఆమె భర్త లింగారెడ్డి
  • పార్టీలో సరైన గుర్తింపు లభించకపోవడం వల్లే వీడామన్న మంజుల దంపతులు
అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన బీఆర్ఎస్‌‌ను వీడేందుకు ఆ పార్టీ నాయకులు సిద్ధమవుతున్నట్టు ఇటీవల తరచూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో అధికార పార్టీ నాయకులతో మంతనాలు కూడా జరుగుతున్నట్టు ప్రచారం జరిగింది. మాజీ మంత్రి మల్లారెడ్డి వంటి నాయకులు కాంగ్రెస్‌కు మద్దతిస్తామని బాహాటంగానే ప్రకటించారు. 


తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జడ్పీటీసీ పూర్మాణి మంజుల, జిల్లా క్రికెట్ అసోసియేసన్ అధ్యక్షుడిగా ఉన్న ఆమె భర్త పూర్మాణి లింగారెడ్డి బీఆర్ఎస్‌కు టాటా చెప్పేశారు. నిన్న ఆ పార్టీకి రాజీనామా చేశారు. మంజుల రెండుసార్లు తంగళ్లపల్లి జడ్పీటీసీగా గెలుపొందారు. రాజీనామా అనంతరం మంజుల దంపతులు మాట్లాడుతూ.. పార్టీలో తమకు సరైన గుర్తింపు లభించడం లేదని, అందుకే రాజీనామా చేసినట్టు తెలిపారు. వీరిద్దరూ త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

Thangallapalli ZPTC
Thangallapalli ZPTC Manjula
BRS
Rajanna Sircilla District

More Telugu News