Corona Virus: భారత్‌లో మళ్లీ కరోనా కలకలం!

India registers 335 new corona cases on Sunday
  • ఆదివారం కొత్తగా వెలుగులోకొచ్చిన 335 కేసులు
  • కరోనా బారిన పడి కేరళలో నలుగురు, యూపీలో ఒకరి మృతి
  • మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1,701గా ఉందన్న ఆరోగ్య మంత్రిత్వ శాఖ

భారత్‌లో మళ్లీ కరోనా కలకలం మొదలైంది. ఆదివారం దేశవ్యాప్తంగా 335 కొత్త కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. మరో ఐదుగురు కరోనాతో మరణించారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,701గా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. మృతుల్లో నలుగురు కేరళ వాసులు కాగా ఉత్తరప్రదేశ్‌లో ఓ వ్యక్తి కరోనాతో కన్నుమూశారు.  

ప్రభుత్వ లెక్కల ప్రకారం, ఇప్పటివరకూ దేశంలో మొత్తం 4.50 కోట్ల కరోనా కేసులు వెలుగుచూశాయి. 4.46 కోట్ల మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో, జాతీయ సగటు రికవరీ రేటు 98.81 శాతంగా నమోదైంది. కొవిడ్ మరణాల సంఖ్య 5,33,316గా ఉంది. అంతేకాకుండా, ఇప్పటివరకూ 220.67 కోట్ల కొవిడ్ టీకా డోసులు పంపిణీ చేశారు.

కేరళలో కొత్త వేరియంట్..
కేరళలో ఇటీవల కొత్త కరోనా సబ్‌ వేరియంట్ జేఎన్.1 వెలుగు చూసిన విషయం తెలిసిందే. సార్స్-కోవ్-2 జీనోమిక్స్ కన్సార్షియమ్ జరుపుతున్న అధ్యయనంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కన్సార్షియం జరిపిన జీనోమిక్ పరీక్షల్లో 79 ఏళ్ల మహిళ జేఎన్.1 సబ్ వేరియంట్ బారిన పడ్డట్టు తేలింది.

  • Loading...

More Telugu News