Sivaji: బిగ్ బాస్-7 గ్రాండ్ ఫినాలే: శివాజీని ఎలిమినేట్ చేసిన 'డెవిల్'

Sivaji eliminated from Bigg Boss house
  • బిగ్ బాస్ సీజన్-7 ముగింపు ఎపిసోడ్
  • ఎలిమినేట్ అయిన శివాజీ
  • కన్నీటి పర్యంతమైన పల్లవి ప్రశాంత్
బిగ్ బాస్ సీజన్-7 గ్రాండ్ ఫినాలే చివరి దశకు చేరుకుంది. హౌస్ లో మిగిలిన ముగ్గురు కంటెస్టెంట్ల నుంచి శివాజీ ఎలిమినేట్ అయ్యాడు. 'డెవిల్' చిత్రం ప్రమోషన్స్ కోసం నందమూరి కల్యాణ్ రామ్, సంయుక్త మీనన్ బిగ్ బాస్ వేదికపైకి వచ్చారు. వారికి బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున ముగ్గురు ఫైనలిస్టుల్లో ఒకరిని ఎలిమినేట్ చేసే బాధ్యత అప్పగించారు. 

ఈ ప్రాసెస్ లో శివాజీ ఎలిమినేట్ అయినట్టు నిర్ధారణ కావడంతో, హౌస్ లో భావోద్వేగాలు నెలకొన్నాయి. పల్లవి ప్రశాంత్ కన్నీటి పర్యంతమవుతూ శివాజీ కాళ్లు పట్టుకుని క్షమించాలని కోరాడు. 

అందుకు శివాజీ స్పందిస్తూ, తాను జీవితంలోనే చాలా చూశానని, మీరు జీవితంలో ఎదగాల్సిన వాళ్లు అంటూ తన ఆశీస్సులు అందించారు. అనంతరం, శివాజీ బిగ్ బాస్ ఇంటిని వీడి స్టేజిపైకి వచ్చారు. ఇక, బిగ్ బాస్ ఇంట్లో పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ ఇద్దరే మిగిలారు. వారిద్దరినీ నాగ్ బిగ్ బాస్ ఇంటి నుంచి బయటికి తీసుకురానున్నారు.
Sivaji
Elimination
Bigg Boss
Season-7
Grand Finale

More Telugu News