Team India: టీమిండియా-దక్షిణాఫ్రికా తొలి వన్డే... 'డబుల్' బ్రేక్ ఇచ్చిన అర్షదీప్

Team India pacer Arshdeep Singh scalps two wickets in two balls
  • నేటి నుంచి టీమిండియా, దక్షిణాఫ్రికా వన్డే సిరీస్
  • జొహాన్నెస్ బర్గ్ లో తొలి వన్డే
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా
  • రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసిన అర్షదీప్
టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ నేడు ప్రారంభమైంది. జొహాన్నెస్ బర్గ్ లోని న్యూ వాండరర్స్ స్టేడియంలో తొలి మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. 

అయితే, రెండో ఓవర్లోనే టీమిండియా లెఫ్టార్మ్ పేసర్ అర్షదీప్ సింగ్ డబుల్ బ్రేక్ ఇచ్చాడు. వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసి టీమిండియా శిబిరంలో ఉత్సాహం నింపాడు. నాలుగో బంతికి రీజా హెండ్రిక్స్ (0)ను బౌల్డ్ చేసిన అర్షదీప్... ఆ తర్వాతి బంతికే వాన్ డర్ డుసెన్ (0)ను ఎల్బీడబ్ల్యూ చేశాడు. అప్పటికి దక్షిణాఫ్రికా స్కోరు 3 పరుగులే. 

ప్రస్తుతం దక్షిణాఫ్రికా స్కోరు 3 ఓవర్లలో 2 వికెట్లకు 7 పరుగులు. ఓపెనర్ టోనీ డిజోర్జి (4 బ్యాటింగ్), కెప్టెన్ ఐడెన్ మార్ క్రమ్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. కాగా, ఈ మ్యాచ్ ద్వారా సాయి సుదర్శన్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు.
Team India
South Africa
Toss
Batting
Arshdeep Singh

More Telugu News