Tamilnadu: కదులుతున్న బస్సు నుంచి అకస్మాత్తుగా ఊడిపోయిన వెనక చక్రాలు

Tamil nadu bus rear tyres falls off
  • తమిళనాడులోని వెల్లాండి ప్రాంతంలో ఘటన
  • తొలుత పేలిన ముందు టైరు 
  • ఆ తరువాత వెనకున్న రెండు టైర్లూ బస్సు నుంచి ఊడొచ్చేసిన వైనం
  • వెంటనే అప్రమత్తమై వాహనాన్ని ఆపేసిన డ్రైవర్, ప్రయాణికులందరూ సురక్షితం
కదులుతున్న బస్సు నుంచి వెనక టైర్లు అకస్మాత్తుగా విడిపోయిన అసాధారణ ఘటన తమిళనాడులో తాజాగా చోటుచేసుకుంది. సేలం సెంట్రల్ బస్టాండ్ నుంచి ఓ ప్రైవేటు బస్సు 30 మంది ప్రయాణికులతో బయలుదేరింది. అయితే, వెల్లాండి ప్రాంతంలో వెళుతుండగా బస్సు ముందు టైరు అకస్మాత్తుగా పేలింది. అదే సమయంలో వెనక టైర్లు రెండూ విడిపోయాయి. దీంతో, వాహనం వెనక భాగం నేలకు తాకడంతో బస్సు పెద్ద శబ్దం చేస్తూ కొంతదూరం వెళ్లింది. ఈ క్రమంలో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈలోపు డ్రైవర్ అప్రమత్తమై బస్సును ఆపేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు.
Tamilnadu
Viral Pics

More Telugu News