Indian Student Missing: బ్రిటన్‌లో భారతీయ విద్యార్థి అదృశ్యం

Indian Student Goes Missing In London BJP Leader Seeks S Jaishankars Help
  • లాఫ్‌బరో యూనివర్సిటీలో చదువుతున్న జీఎస్ భాటియా అదృశ్యం
  • డిసెంబర్ 15 నుంచి విద్యార్థి కనిపించట్లేదని ఎక్స్ వేదికగా వెల్లడించిన బీజేపీ నేత
  • విషయాన్ని ట్విట్టర్ వేదికగా మంత్రి జైశంకర్ దృష్టికి తీసుకెళ్లిన వైనం
  • స్టూడెంట్ ఆచూకీ కనుగొనడంలో సాయపడాలంటూ భారత హైకమిషన్‌కూ విజ్ఞప్తి 
లండన్‌లో చదువుకుంటున్న ఓ భారతీయ విద్యార్థి అకస్మాత్తుగా కనిపించకుండా పోయిన ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. లాఫ్‌బరో యూనివర్సిటీలో చదువుకుంటున్న జీఎస్ భాటియా డిసెంబర్ 15 నుంచి కనిపించట్లేదని భారతీయ జనతా పార్టీ నేత మన్‌జిందర్ సింగ్ సిర్సా తాజాగా వెల్లడించారు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని మంత్రి జయ్‌శంకర్ దృష్టికి తీసుకెళ్లారు. అతడి ఆచూకీ కనుగొనేందుకు యూనివర్సిటీ, భారత రాయబార కార్యాలయం సాయం కూడా కోరారు. భాటియా ఫొటో, గుర్తింపు కార్డు, ఇతర వివరాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అతడి గురించి తెలిసిన వారు తక్షణం తమకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
Indian Student Missing
London
UK
Subrahmanyam Jaishankar

More Telugu News