Mobile Blast: జేబులో పేలిన ఫోన్.. భయంతో పరుగులు తీసిన స్థానికులు

Mobile blast in Gadwal Telangana
  • గద్వాలలో ఘటన
  • పేలుడుతో చెల్లాచెదురుగా పడిన ఫోన్ భాగాలు
  • ఎలాంటి గాయాలు లేకుండా తప్పించుకున్న బాధితుడు

గతంలో తరచూ మొబైల్ ఫోన్లు పేలిన ఘటనలు వెలుగులోకి వచ్చేవి. ఇటీవలి కాలంలో ఇలాంటి వార్తలు వినిపించడం లేదు. తయారీదారులు తీసుకుంటున్న భద్రతాపరమైన చర్యలే అందుకు కారణం కావొచ్చు. అయితే, తాజాగా గద్వాలలో ఫోన్ పేలిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో బాధితుడు ఎలాంటి గాయాలు కాకుండా తప్పించుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

గద్వాలలోని బీసీ కాలనీకి చెందిన జయరాముడు కూరగాయాలు కొనేందుకు మార్కెట్‌ వచ్చాడు. ఈ క్రమంలో జేబులో ఉన్న ఫోన్ పేలిపోయింది. ఫోన్ భాగాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఫోన్ పేలుడుతో భయపడిన స్థానికులు దూరంగా పరుగులు తీశారు. బాధితుడి ప్యాంటు కాలిపోయింది. జయరాముడు వెంటనే అప్రమత్తం కావడంతో ఎలాంటి గాయాలు లేకుండా తప్పించుకున్నాడు.

  • Loading...

More Telugu News