Vaishnavi Dhanraj: పోలీసులను ఆశ్రయించిన నటి.. ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదు

CID actor approaches mumbai police with complaints of abuse by family members
  • కుటుంబసభ్యులపై ముంబై పోలీసులకు సీఐడీ సిరీస్ నటి వైష్ణవి ధన్‌రాజ్ ఫిర్యాదు
  • అయినవాళ్లే తనపై దాడికి దిగారంటూ నెట్టింట వీడియో విడుదల
  • ఇండస్ట్రీ, మీడియా వారు తనకు సాయం చేయాలంటూ అభ్యర్థన
సీఐడీ సిరీస్‌లో పోలీస్ ఇన్‌స్పెక్టర్ పాత్రలో ప్రేక్షకులను మెప్పించిన నటి వైష్ణవి ధనరజ్ తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కుటుంబసభ్యులు తనపై శారీరక హింసకు పాల్పడుతున్నారని ఆరోపించింది. ఈ మేరకు ‘ఎక్స్’లో ఓ వీడియో కూడా పోస్ట్ చేసింది. ‘నాకు సాయం కావాలి. నేను కాశీమీరా పోలీస్ స్టేషన్‌లో (ముంబై) ఉన్నాను. నా కుటుంబమే నాపై వేధింపులకు పాల్పడింది. నా పట్ల దారుణంగా వ్యవహరించారు. న్యూస్ ఛానల్స్‌తో పాటు సినీ ఇండస్ట్రీ వారు సాయం చేయండి’’ అని ఓ వీడియో పోస్ట్ చేసింది. వీడియోలో తన నోరు, కుడిచేయి మణికట్టుపై ఉన్న గాయాలను కూడా ఆమె చూపించింది. వైష్ణవి తన కుటుంబసభ్యులపై నాన్ కాగ్నిజబుల్ ఫిర్యాదు చేసినట్టు పోలీసులు తెలిపారు.  

వైష్ణవి 2016లో నటుడు నితిన్ షెరావత్‌ను పెళ్లి చేసుకుని ఆ తరువాత కొన్ని రోజులకే విడాకులు తీసుకుంది. ప్రస్తుతం ఆమె తన తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది.
Vaishnavi Dhanraj
Mumbai
Crime News

More Telugu News