Daughter in law: అత్తపై కోడలి దాడి.. వీడియో వైరల్ కావడంతో అరెస్ట్

Daughter in law attacked aunt video went viral and  Arrested
  • కేరళలోని కొల్లాంలో వెలుగులోకి దారుణ ఘటన
  • వీడియో వైరల్ కావడంతో నిందితురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • నిందితురాలపై మండిపడుతున్న నెటిజన్లు
కేరళలోని కొల్లాంకు చెందిన వృద్ధురాలిని ఆమె కోడలు దారుణంగా కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోలీసులు ప్రకటన చేశారు. కాగా వృద్ధురాలిపై నిందిత మహిళ దారుణంగా దాడి చేయడం వీడియోలో రికార్డు అయింది. బలవంతంగా నెట్టడంతో వృద్ధురాలు నేలపై పడింది.  అక్కడే ఉన్న ఓ వ్యక్తి తన సెల్‌ఫోన్‌లో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో కేరళ పోలీసుల కంట్లో పడింది. దీంతో వెంటనే చర్యలు ప్రారంభించి నిందితురాలిని అరెస్ట్ చేశారు.

నిందితురాలిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిందితురాలిని వెంటనే అరెస్ట్ చేయాలని  దీపికా నారాయణ్ భరద్వాజ్ అనే సామాజిక కార్యకర్తతో పాటు పెద్ద సంఖ్యలో నెటిజన్లు డిమాండ్ చేశారు. సమాజంలో వృద్ధులపై అకృత్యాలు నానాటికీ విపరీతంగా పెరిగిపోతున్నాయని నారాయణ్ ఆందోళన వ్యక్తం చేశారు. వృద్ధుల పట్ల ఈ విధంగా వ్యవహరించడం దారుణమని ఖండించారు. నిందిత మహిళను వెంటనే అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వృద్ధురాలిని తిట్టేందుకు చిన్నారికి కూడా ఆమె శిక్షణ ఇస్తుండడం నిజంగా కలవరపెట్టే విషయమని అన్నారు. కాగా వీడియో పోలీసులకు చేరేవరకు నెజిజన్లు విస్తృతంగా షేర్ చేశారు. దీంతో పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. కాగా వృద్ధురాలిని కొడుతుండడాన్ని పిల్లలు నిలబడి చూస్తున్నట్లు వీడియోలో కనిపించింది.
Daughter in law
Aunt attacked
viral video
Kerala

More Telugu News