Telangana: తెలంగాణలో 9 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగులు

Telangana Government gave postings to 9 officers
  • ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇస్తూ ఉత్తర్వుల జారీ
  • వివిధ జిల్లాల్లో బాధ్యతలు కేటాయిస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వుల్లో సంతకం 
  • 2021 బ్యాచ్ అధికారులకు పోస్టింగులు 
తెలంగాణలో తొమ్మిది మంది ఐఏఎస్‌లకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు వివిధ జిల్లాల్లో బాధ్యతలు కేటాయిస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వుల్లో సంతకం చేశారు. హన్మకొండ అడిషనల్ కలెక్టర్‌గా రాధికా గుప్తా, ములుగు అడిషనల్ కలెక్టర్‌గా పి.శ్రీజ, నిర్మల్ అడిషనల్ కలెక్టర్‌గా ఫైజాన్ అహ్మద్, రాజన్న సిరిసిల్ల అడిషనల్‌ కలెక్టర్‌గా పి.గౌతమి, జనగామ అడిషనల్ కలెక్టర్‌గా పర్మర్‌ పింకేశ్ కుమార్, మహబూబాబాద్ అడిషనల్ కలెక్టర్‌గా లెనిన్ వత్సల్‌ తొప్పో, మహబూబ్‌నగర్ అడిషనల్ కలెక్టర్‌గా శివేంద్ర ప్రతాప్‌, వనపర్తి అడిషనల్ కలెక్టర్‌గా సంచిత్ గంగ్వార్, జయశంకర్ భూపాలపల్లి అడిషనల్ కలెక్టర్‌గా కదిరవన్‌లకు పోస్టింగ్‌లు ఇచ్చింది. 2021 బ్యాచ్ అధికారులకు ప్రభుత్వం పోస్టింగులు ఇచ్చింది.
Telangana
government
ias

More Telugu News