Revanth Reddy: తెలంగాణ కోసం రాజీనామా చేసిన మాజీ డీఎస్పీ నళినిని ఎందుకు తీసుకోకూడదు?: రేవంత్ రెడ్డి

Revanth Reddy questions about Former DSP Nalini
  • నళినికి ఉద్యోగం చేయాలనే ఆసక్తి ఉంటే మళ్లీ ఆమెను విధుల్లోకి తీసుకోవాలన్న ముఖ్యమంత్రి
  • పోలీస్ శాఖలో నిబంధనలు అడ్డు వస్తే ఇతర శాఖలో ఉద్యోగం ఇవ్వాలని సూచన
  • ఆమెకు రాజీనామా చేసిన నాటి హోదాలో ఇతర శాఖలో ఉద్యోగం ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సూచన
మాజీ డీఎస్పీ నళిని తెలంగాణ కోసం తన ఉద్యోగానికి రాజీనామా చేశారని... అదే నళినికి ఉద్యోగం ఇవ్వడానికి వచ్చిన ఇబ్బంది ఏమిటి? అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను ప్రశ్నించారు. పోలీస్ శాఖలో నియామకాలపై సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నళినికి ఉద్యోగం చేయాలనే ఆసక్తి ఉంటే మళ్లీ ఆమెను విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించారు. పోలీస్ శాఖలో నిబంధనలు అడ్డు వస్తే కనుక ఇతర శాఖలో ఉద్యోగం ఇవ్వాలని సూచించారు. ఆమెకు రాజీనామా చేసిన నాటి హోదాలో ఇతర శాఖలో ఉద్యోగం ఇచ్చే అంశాన్ని పరిశీలించాలన్నారు. ఉద్యోగం వదిలేసి ఎన్నికల్లో పోటీ చేసిన వారు కొందరు తిరిగి ఉద్యోగాలలో చేరారని గుర్తు చేశారు. మరి తెలంగాణ కోసం ఉద్యోగాన్ని వదిలేసిన నళినికి ఎందుకు ఇవ్వకూడదు? అని ప్రశ్నించారు.
Revanth Reddy
nalini
Telangana
Congress

More Telugu News