Revanth Reddy: కరాచీ బేకరీ అగ్ని ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి

  • క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు
  • గాయపడ్డ వారిలో ఎక్కువమంది ఉత్తర ప్రదేశ్ కార్మికులు
  • పేలుడు ఘటనపై దర్యాఫ్తు చేస్తోన్న పోలీసులు
CM Revanth asks officials proved better medical care to injured in karachi fire accident

శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధి... గగన్ పహాడ్‌లోని కరాచీ బేకరీ గోడౌన్‌లో జరిగిన పేలుడుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. క్షతగాత్రుల్లో ఎక్కువ మంది ఉత్తర ప్రదేశ్‌కు చెందినవారు ఉన్నట్లుగా సీఎంకు అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో ఎనిమిది మందిని కంచన్‌బాగ్ డీఆర్డీవో ఆసుపత్రికి తరలించినట్లు వారు ముఖ్యమంత్రికి చెప్పారు. కరాచీ బేకరీ గోడౌన్‌లో జరిగిన పేలుడు ధాటికి పదిహేను మంది కార్మికులు గాయపడ్డారు. ఇందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. పేలుడు ఘటనపై పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.

More Telugu News