మంత్రిగా బాధ్యతలను స్వీకరించిన పొంగులేటి.. తొలి సంతకం దేనిపై పెట్టారంటే..!
- సెక్రటేరియట్ లోని తన ఛాంబర్ లో బాధ్యతలను స్వీకరించిన పొంగులేటి
- హాజరైన కుటుంబ సభ్యులు, పలువురు ఎమ్మెల్యేలు
- రాయగిరి స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు 10 ఎకరాల భూమిని కేటాయిస్తూ తొలి సంతకం
మంత్రిగా భువనగిరి జిల్లా రాయగిరి స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం 10 ఎకరాల భూమిని కేటాయిస్తూ పొంగులేటి తొలి సంతకం చేశారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను నిర్మించడానికి యువజన, క్రీడల శాఖకు స్థలాన్ని కేటాయించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల డీపీఆర్వోలకు అధునాతన కెమెరాలను అందించే సమాచార, పౌర సంబంధాల శాఖకు చెందిన ఫైల్ పై మరో సంతకం చేశారు. గృహనిర్మాణ శాఖకు చెందిన పాలనాపరమైన పలు ఫైళ్లపై కూడా సంతకాలు చేశారు.