KTR: వరల్డ్ కప్ కు ఎంపికైన హైదరాబాద్ అండర్-19 క్రికెటర్లకు కేటీఆర్ అభినందనలు

KTR appreciates Hyderabad Under 19 cricketers for being selected to play in World Cup
  • ప్రస్తుతం ఆసియా కప్ లో భారత జట్టుకు ఆడుతున్న అవనీశ్, అభిషేక్
  • త్వరలో దక్షిణాఫ్రికాలో ముక్కోణపు సిరీస్, అండర్-19 వరల్డ్ కప్
  • అవనీశ్, అభిషేక్ లను ఎంపిక చేసిన బీసీసీఐ జూనియర్ సెలెక్షన్ కమిటీ
హైదరాబాదీ అండర్-19 క్రికెటర్లు ఆరవెల్లి అవనీశ్ రావు, మురుగన్ అభిషేక్ ప్రస్తుతం అండర్-19 ఆసియా కప్ లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆసియా కప్ లో సత్తా చాటుతుండడంతో, వీరిద్దరినీ త్వరలో దక్షిణాఫ్రికాలో జరిగే ముక్కోణపు సిరీస్, అండర్-19 వరల్డ్ కప్ లో ఆడే భారత జట్టుకు కూడా ఎంపిక చేశారు. 

దీనిపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తెలంగాణకు చెందిన యువ క్రికెటర్లు అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతుండడం, అండర్-19 వరల్డ్ కప్ వంటి మెగా ఈవెంట్ కు ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆరవెల్లి అవనీశ్ రావు, మురుగన్ అభిషేక్ లకు అభినందనలు తెలిపారు. 

ముఖ్యంగా, ఆరవెల్లి అవనీశ్ రావు తన సిరిసిల్ల నియోజకవర్గానికి చెందినవాడు కావడంతో కేటీఆర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ ప్రతిభావంతుడైన క్రికెటర్ రాజన్న సిరిసిల్ల నియోజకవర్గంలోని పోతగల్ గ్రామానికి చెందినవాడని వెల్లడించారు. వీరిద్దరూ ఆయా టోర్నీలలో రాణించాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.
KTR
Avanish Rao
Murugan Abhishek
Under-19 World Cup
India
South Africa
Hyderabad
Telangana

More Telugu News