Rana: 'రాక్షస రాజా'గా వస్తున్న రానా

Rana Turns Rakshasa Raja In His Next With Director Teja
  • డైరెక్టర్ తేజ, రానా కాంబినేషన్ లో కొత్త మూవీ
  • వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన నేనే రాజు నేనే మంత్రి
  • రానా బర్త్ డే సందర్భంగా ఫస్ట్ పోస్టర్ రిలీజ్
‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో డైరెక్టర్ తేజ, హీరో దగ్గుబాటి రానా కాంబినేషన్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో రానాలోని ఓ కొత్త షేడ్ ను డైరెక్టర్ తేజ ప్రేక్షకులకు పరిచయం చేశాడు. డైరెక్టర్ గా తనలోనూ ఓ కొత్త వేరియేషన్ ను చూపించాడు. కాజల్- రానాల లవ్ ట్రాక్, మ్యూజిక్, ఎమోషనల్ క్లైమాక్స్, ఎండింగ్ లో రానా స్పీచ్.. ఇలా ప్రతి విషయంలో 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా ఔట్ స్టాండింగ్ గా ఉంటుంది. రానా, తేజ.. ఇద్దరికీ ప్రత్యేకంగా నిలిచిన సినిమా ఇది. వీళ్లిద్దరి కాంబినేషన్ లో మరో కొత్త సినిమా రాబోతోంది. దీంతో సహజంగానే ప్రేక్షకుల అంచనాలు పెరిగిపోయాయి. గురువారం దగ్గుబాటి రానా పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ పోస్టర్ ను మీడియాకు రిలీజ్ చేశారు.

ఈ కొత్త ప్రాజెక్టులో రానాను రాక్షసుడిగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. టైటిల్ కూడా ‘రాక్షస రాజా’ అని ఫిక్స్ చేసినట్లు హీరో, డైరెక్టర్లు అనౌన్స్ చేశారు. అనంతరం ఫస్ట్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో నుదుట నామాలు, భుజాన గన్, నోట్లో చుట్టతో రానా చాలా వైల్డ్ గా కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ తో రాక్షస రాజుగా రానా పాత్ర ఎంత వైల్డ్ గా ఉండబోతోందో చెప్పే ప్రయత్నం చేశారు. అయితే, ఈ సినిమా ‘నేనే రాజు నేనే మంత్రి’ రేంజ్ లో ప్రభావం చూపనుందా అంటే.. వేచి చూడాల్సిందేనని సినీ విశ్లషకులు అభిప్రాయపడుతున్నారు.
Rana
Rakshasa Raja
Teja
New Movie
Rana Teja
nene raju nene mantri
First poster
Rana Birthday

More Telugu News