Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. కోమటిరెడ్డి, కేటీఆర్ సహా పలువురు ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం

Komatireddy and KTR and others took oath as MLAs in TS Assembly
  • ఎమ్మెల్యేల చేత ప్రమాణస్వీకారం చేయించిన ప్రొటెం స్పీకర్
  • అనారోగ్య కారణాలతో సభకు హాజరు కాలేని కేసీఆర్
  • ప్రమాణస్వీకారానికి దూరంగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణస్వీకారం చేయించారు. ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేసిన వారిలో మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కేటీఆర్, కడియం శ్రీహరి తదితరులు ఉన్నారు. అనారోగ్య కారణాలతో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు హాజరుకాలేదు. అక్బరుద్దీన్ ప్రొటెం స్పీకర్ గా ఉంటే తాము ప్రమాణస్వీకారం చేయబోమని బీజేపీ ఎమ్మెల్యేలు ప్రకటించిన సంగతి తెలిసిందే. వారు చెప్పిన విధంగానే ఇప్పుడు కూడా ప్రమాణస్వీకారం చేయలేదు. కొత్త స్పీకర్ ఎన్నికైన తర్వాత వారు ప్రమాణస్వీకారం చేస్తారు.
Telangana Assembly
Assembly Sessions
MLAs
Oath

More Telugu News