Bigg Boss 7: బిగ్ బాస్ ఫినాలేకి గెస్టులుగా రానున్న ఇద్దరు టాప్ హీరోలు?

Balakrishna and Mahesh Babu are chief guests for Bigg Boss 7 finale
  • ఈ వారంతో ముగుస్తున్న బిగ్ బాస్ సీజన్ 7
  • టైటిల్ పోరు శివాజీ, ప్రశాంత్, అమర్ ల మధ్య ఉండే అవకాశం
  • గెస్టులుగా బాలకృష్ణ, మహేశ్ బాబు రాబోతున్నట్టు ప్రచారం
గత సీజన్ లో ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయిందనే విమర్శలను మూటకట్టుకున్న బిగ్ బాస్... ఈ సీజన్ లో మాత్రం అదరగొడుతోంది. బిగ్ బాస్ సీజన్ 7 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. ఈ వారంతో బిగ్ బాస్ ముగుస్తోంది. మరోవైపు బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకు ఇద్దరు స్టార్ హీరోలు గెస్టులుగా వస్తున్నట్టు తెలుస్తోంది. బాలకృష్ణ, మహేశ్ బాబు అతిథులుగా రాబోతున్నారని చెపుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పెద్ద ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం ఆరుగురు కంటెస్టెంట్లు శివాజీ, ప్రశాంత్, అమర్, అర్జున్, ప్రియాంక, యావర్ లు హౌస్ లో ఉన్నారు. వీరిలో మిడి వీక్ ఎలిమినేషన్ లో ఒకరు ఎలిమినేట్ కానున్నారు. టైటిల్ పోరు శివాజీ, ప్రశాంత్, అమర్ ల మధ్య ఉండే అవకాశం ఉంది.
Bigg Boss 7
Finale
Guests
Tollywood
Balakrishna
Mahesh Babu

More Telugu News