అర్జున అవార్డు రేసులో మహ్మద్ షమీ!
- వరల్డ్ కప్ ప్రదర్శనతో నామినీల జాబితా చేరిక
- షమీని నామినీగా పరిగణించాలంటూ బీసీసీఐ ప్రత్యేక అభ్యర్థన
- బీసీసీఐ విజ్ఞప్తి మేరకు షమీని ఎంపిక చేసిన క్రీడా శాఖ
వరల్డ్ కప్‌లో షమీ అసామాన్య ప్రదర్శన క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన విషయం తెలిసిందే. టోర్నీలో కేవలం 7 మ్యాచుల్లో 24 వికెట్లు పడగొట్టి అత్యధికంగా వికెట్లు తీసిన ఆటగాడిగా షమీ నిలిచాడు. శ్రీలంకతో మ్యాచ్‌లో షమీ కేవలం 18 పరుగులిచ్చి 5 వికెట్లు తీయడం యావత్ టోర్నీకే హైలైట్‌గా నిలిచింది. టోర్నీలో తొలి నాలుగు మ్యాచ్‌లకు అందుబాటులో లేని షమీ ఆ తరువాత తన అద్భుత ప్రదర్శనతో యావత్ టోర్నీలో స్టార్‌గా నిలిచాడు.