K Kavitha: యశోద ఆసుపత్రిలో కోమటిరెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha visits Minister Komatireddy
  • కోమటిరెడ్డి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న కవిత
  • మంత్రి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన కవిత
  • అంతకుముందు కోమటిరెడ్డిని పరామర్శించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. కొన్ని రోజులుగా గొంతు నొప్పితో బాధపడుతున్న కోమటిరెడ్డి... ఢిల్లీ నుంచి రాగానే సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చేరారు. మంత్రికి వైద్య పరీక్షలు చేసిన వైద్యులు.. రెండు రోజులు ఆసుపత్రిలోనే ఉండాలని సూచించారు. దీంతో ఆయన యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రిలో ఆయనను పలువురు రాజకీయ నాయకులు పరామర్శిస్తున్నారు. మధ్యాహ్నం కవిత ఆయనను పరామర్శించారు. కోమటిరెడ్డి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మంత్రి త్వరగా కోలుకోవాలని కవిత ఆకాంక్షించారు. అంతకుముందు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆసుపత్రికి వచ్చి కోమటిరెడ్డిని పరామర్శించారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా పరామర్శించారు.
K Kavitha
Telangana
Komatireddy Venkat Reddy
Congress
BRS

More Telugu News