Ch Malla Reddy: మాజీ మంత్రి మల్లారెడ్డిపై శామీర్‌పేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

Police filed case against Former Minister Malla Reddy
  • తమ భూమిని ఆక్రమించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన గిరిజనులు
  • 47 ఎకరాల భూమిని రాత్రికి రాత్రే రిజిస్ట్రేష్ చేసుకున్నట్లు ఆరోపణ
  • నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు
మాజీ మంత్రి, బీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిపై భూకబ్జా కేసు నమోదయింది. తమ భూమిని ఆక్రమించారంటూ గిరిజనులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలంలోని కేశవపురంలో 47 ఎకరాల గిరిజనుల భూమిని మల్లారెడ్డి కబ్జా చేశారని ఆరోపిస్తూ శామీర్‌పేట పోలీస్ స్టేషన్‌లో భిక్షపతి అనే వ్యక్తితో కలిసి పలువురు ఫిర్యాదు చేశారు. ఎన్నికల సమయంలో రాత్రికి రాత్రే రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆరోపించారు. దీంతో ఫిర్యాదు స్వీకరించిన శామీర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాఫ్తు జరుపుతున్నట్లు తెలిపారు. మల్లారెడ్డిపై పోలీసులు నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Ch Malla Reddy
Police
Medchal Malkajgiri District

More Telugu News