Hyderabad: రాచకొండ సీపీ చౌహాన్‌కు పూలవర్షంతో వీడ్కోలు... ఇదిగో వీడియో

A floral farewell to Rachakonda CP Chauhan
  • చౌహాన్‌కు కమిషనర్ కార్యాలయంలో ఘనంగా వీడ్కోలు
  • కార్యాలయం నుంచి బయటకు వచ్చే సమయంలో... పూల వర్షం
  • నెట్టింట వైరల్‌గా మారిన వీడియో
రాచకొండ సీపీ డీసీ చౌహన్‌కు కార్యాలయంలో పూలతో వీడ్కోలు పలికారు. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజులకే పోలీస్ శాఖలో మార్పులకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో పలువురు కమిషనర్లను డీజీపీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఇందులో రాచకొండ సీపీగా పని చేసిన చౌహాన్ కూడా ఉన్నారు. దీంతో ఆయనకు కమిషనర్ కార్యాలయంలో ఘనంగా వీడ్కోలు పలికారు. ఆయన కార్యాలయం నుంచి బయటకు వచ్చే సమయంలో... ఒక్కో పోలీస్ అధికారి పూల వర్షం కురిపిస్తూ ఘనంగా వీడ్కోలు పలికారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆయన బయటకు వచ్చి మహిళా పోలీసులతో ఫొటో దిగారు. కాగా, రాచకొండ సీపీగా సుధీర్ బాబును నియమించారు. చౌహన్ డీజీపీ కార్యాలయంలో రిపార్ట్ చేశారు.
Hyderabad
Hyderabad Police
Telangana
Congress

More Telugu News