Team India: రెండో టీ20: దక్షిణాఫ్రికాపై టాస్ ఓడిన టీమిండియా

Team India lost toss in 2nd T20 against South Africa
  • టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య 3 టీ20లు
  • తొలి మ్యాచ్ వర్షార్పణం
  • నేడు రెండో మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా
టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్ లో భాగంగా నేడు రెండో మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ కు కెబెరాలోని సెయింట్ జార్జెస్ పార్క్ మైదానం వేదికగా నిలుస్తోంది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ వర్షార్పణం అయిన సంగతి తెలిసిందే. వర్షం కారణంగా ఒక్క బంతి పడకుండానే ఆ మ్యాచ్ రద్దయింది. ఇవాళ రెండో మ్యాచ్ ప్రారంభానికి ముందు కూడా కెబెరాలో జల్లు పడడంతో క్రికెట్ అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే వర్షం నిలిచిపోవడంతో అభిమానుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది.

టీమిండియా...
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్ మాన్ గిల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, ముఖేశ్ కుమార్.

దక్షిణాఫ్రికా...
ఐడెన్ మార్ క్రమ్ (కెప్టెన్), మాథ్యూ బ్రీజ్కే, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, ట్రిస్టాన్ స్టబ్స్, మార్కో యన్సెన్, ఆండిలే ఫెహ్లుక్వాయో, గెరాల్డ్ కోట్జీ, లిజాద్ విలియమ్స్, తబ్రైజ్ షంసీ. 

Team India
South Africa
Toss
2ndt T20

More Telugu News