Komatireddy Venkat Reddy: మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Minister Komatireddy Venkat Reddy greets ex cm kcr in hospital
  • యశోద ఆసుపత్రిలో పరామర్శించిన మంత్రి
  • కేసీఆర్ ఆరోగ్యంపై డాక్టర్లను అడిగి తెలుసుకున్న కోమటిరెడ్డి
  • యశోద ఆసుపత్రికి వరుస కడుతున్న ప్రముఖులు
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కాంగ్రెస్ నేత, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరామర్శించారు. ఇటీవల తన నివాసంలో కేసీఆర్ కాలు జారి కిందపడ్డారు. వెంటనే ఆయనను సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో కేసీఆర్‌ను పరామర్శించేందుకు ప్రజాప్రతినిధులు, సినిమా తారలు ఆసుపత్రికి వరుస కడుతున్నారు. తాజాగా మంత్రి కోమటిరెడ్డి ఆయనను పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్యం గురించి డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అంతకుముందు మాజీ సీఎం కేసీఆర్‌ను ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ పరామర్శించారు.
Komatireddy Venkat Reddy
Congress
BRS
Telangana

More Telugu News