KCR: కేసీఆర్‌ను పరామర్శించిన అక్బరుద్దీన్ ఒవైసీ

Akbaruddin Owaisi greets ex cm kcr in hospital
  • బాత్రూంలో కాలు జారి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్
  • కేసీఆర్ త్వరగా కోలుకొని ప్రజా సేవలోకి రావాలని ఆకాంక్షించిన అక్బరుద్దీన్ 
  • డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్న మజ్లిస్ లీడర్ 
కొన్ని రోజుల క్రితం బాత్రూంలో జారిపడటంతో సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ను మజ్లిస్ పార్టీ నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ పరామర్శించారు. ఆయన ఆసుపత్రికి వెళ్లి కేసీఆర్‌ను పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకొని ప్రజాసేవలోకి రావాలని అక్బరుద్దీన్ ఆకాంక్షించారు. 

ఇక కేసీఆర్‌ను పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పరామర్శిస్తున్నారు.  రేవంత్ రెడ్డి, చిరంజీవి, మల్లు భట్టి విక్రమార్క, చంద్రబాబు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు తదితరులు పరామర్శించారు. కేసీఆర్‌కు హిప్ రిప్లేస్‌మెంట్ సర్జరీ జరిగింది. 
KCR
Telangana
BRS
Akbaruddin Owaisi

More Telugu News