Revanth Reddy: రేవంత్ రెడ్డి సెక్రటరీగా ఐపీఎస్ అధికారి షానవాజ్ ఖాసిం

IPS Shahnawaz Qasim appointed as Revanth Reddy secretary
  • తెలంగాణలో కొనసాగుతున్న ఐపీఎస్ ల బదిలీలు
  • రేవంత్ సెక్రటరీగా హైదరాబాద్ రేంజ్ ఐజీ షానవాజ్ ఖాసిం
  • జంట నగరాల పరిధిలోని సీపీలను ఉదయం బదిలీ చేసిన ప్రభుత్వం
తెలంగాణలో సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. ఈరోజు ఇప్పటికే జంట నగరాల పరిధిలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లను ప్రభుత్వం మార్చింది. తాజాగా మరో మార్పు చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్రటరీగా ఐపీఎస్ అధికారి షానవాజ్ ఖాసింను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ప్రస్తుతం షానవాజ్ ఖాసిం హైదరాబాద్ రేంజ్ ఐజీగా ఉన్నారు. 

మరోవైపు హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, సైబరాబద్ సీపీగా అవినాశ్ మహంతి, రాచకొండ సీపీగా సుధీర్ బాబు నియమితులయ్యారు. సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, రాచకొండ సీపీ చౌహాన్ లను డీజీపీకి అటాచ్ చేశారు. వీరికి ఇంకా పోస్టింగ్ లు ఇవ్వలేదు. హైదరాబాద్ సీపీగా ఉన్న సందీప్ శాండిల్యను నార్కోటిక్స్ వింగ్ డైరెక్టర్ గా బదిలీ చేశారు.
Revanth Reddy
Congress
Secretary
Shahnawaz Qasim

More Telugu News