Nara Lokesh: అంగన్ వాడీల ఉద్యమానికి టీడీపీ సంపూర్ణ మద్దతు: నారా లోకేశ్

Nara Lokesh says TDP extends support to Anganwadi strike
  • తమ డిమాండ్ల సాధన కోసం అంగన్ వాడీల సమ్మె బాట
  • అందరినీ మోసం చేసినట్టే జగన్ అంగన్ వాడీలను కూడా మోసం చేశాడన్న లోకేశ్
  • అధిక వేతనంపై మాట తప్పాడని విమర్శలు 
వేతనాల పెంపు, గ్రాట్యుటీలపై డిమాండ్ చేస్తున్న అంగన్ వాడీ కార్యకర్తలు, సహాయకులు ప్రభుత్వం మాట తప్పిందంటూ రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగడం తెలిసిందే. దీనిపై నారా లోకేశ్ స్పందించారు. అంగన్ వాడీల ఉద్యమానికి టీడీపీ సంపూర్ణ మద్దతు ఇస్తోందని ప్రకటన చేశారు. అందరినీ మోసం చేసినట్టే, జగన్ అంగన్ వాడీలను కూడా మోసం చేశాడని లోకేశ్ విమర్శించారు. పనికి తగ్గ వేతనం ఇస్తామని జగన్ మాట తప్పారని ఆరోపించారు. పొరుగు రాష్ట్రాల కంటే అధిక జీతం హామీ పైనా మడమ తిప్పారని లోకేశ్ వివరించారు. పైగా, అంగన్ వాడీలపై పని ఒత్తిడి పెంచారని విమర్శించారు.
Nara Lokesh
Anganwadi
Strike
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News