Telangana: 2024 సంవత్సరానికి గాను సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

Telangana Government announces holidays for 2024
  • వచ్చే ఏడాదికి 27 సాధారణ సెలవులు, 23 ఐచ్ఛిక సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
  • జనవరి 1న సెలవు దినంగా ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం
  • దానికి బదులు ఫిబ్రవరి 10 రెండో శనివారాన్ని పనిదినంగా ప్రకటన
2024 సంవత్సరానికి గాను తెలంగాణ ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. వచ్చే ఏడాదికి రాష్ట్ర ప్రభుత్వం 27 సాధారణ సెలవులు, 25 ఐచ్ఛిక సెలవులను ప్రకటించింది. 2024 జనవరి 1న ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా ప్రభుత్వం సెలవును ప్రకటించింది. దీనికి బదులు ఫిబ్రవరి 10వ తేదీన రెండో శనివారాన్ని పని దినంగా ప్రకటించింది. నెగోషియబుల్ ఇన్‌ స్ట్రుమెంటల్ చట్టం కింద 23 సాధారణ సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
Telangana
government
Congress

More Telugu News