Dance: లోకల్ ట్రైన్ లో రీల్స్ చేస్తున్న యువతితో కానిస్టేబుల్ డ్యాన్స్... వీడియో వైరల్

Police constable dance with woman in Mumbai local train
  • ముంబయి లోకల్ ట్రైన్లో యువతి డ్యాన్స్
  • పొరబాటున కానిస్టేబుల్ కు తగిలిన యువతి
  • ఏమనకుండా తాను కూడా డ్యాన్స్ చేసిన పోలీసు
  • వీడియోకు నెటిజన్ల నుంచి విశేష స్పందన

సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర వీడియో వైరల్ అవుతోంది. ఓ యువతి రీల్స్ చేసే క్రమంలో ముంబయి లోకల్ రైల్లో డ్యాన్స్ చేస్తుండగా, ఆమెతో ఓ పోలీస్ కానిస్టేబుల్ కూడా కాలు కదపడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 

తన పాటికి తాను డ్యాన్స్ చేస్తున్న యువతి... రైల్లో నిలబడి ఉన్న కానిస్టేబుల్ కు పొరబాటున తగలడంతో, ఆయన ఏమంటాడో అనుకుని యువతి డ్యాన్స్ ఆపేయడం.. ఆయన టేకిటీజీ పాలసీలో స్పందించి... "డోర్ వద్దకు వెళ్దొద్దు... పడతావు జాగ్రత్త" అంటూ చెప్పడం... అనంతరం ఆమెతో కలిసి తాను కూడా డ్యాన్స్ చేయడం వీడియోలో చూడొచ్చు. 

ఓ మరాఠీ గీతానికి వారు డ్యాన్స్ చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈ వీడియోకు నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది.

  • Loading...

More Telugu News