Chandrababu: ఫైబర్ నెట్ కేసు.. విచారణను వచ్చే నెలకు వాయిదా వేసిన సుప్రీంకోర్టు

  • వచ్చే నెల 17కి తదుపరి విచారణ వాయిదా
  • కేసు గురించి చంద్రబాబు, ప్రభుత్వం మాట్లాడకూడదని సూచన
  • బాబు తరపున వాదనలు వినిపించిన సిద్ధార్థ్ లూథ్రా
Supreme Court adjourns Chandrababu anticipatory bail petition in Fibernet case

ఏపీ ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. తదుపరి విచారణను జనవరి 17కి జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన ధర్మాసనం వాయిదా వేసింది. కేసుకు సంబంధించి ఇటు చంద్రబాబు కానీ, అటువైపు ఏపీ ప్రభుత్వం కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని సూచించింది. చంద్రబాబు తరపున సీనియర్ కౌన్సిల్ సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. 

మరోవైపు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పు వెలువడాల్సి ఉంది. ఈ కేసులో తీర్పు ఇతర కేసులపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. 

More Telugu News