Hyderabad CP: హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్ల బదిలీ.. కొత్త సీపీలు వీరే!

New Police Commissioners for Hyderabad and Cyberabad and Rachakonda commissionerates
  • హైదరాబాద్ కమిషనర్ గా కొత్తకొట శ్రీనివాస్ రెడ్డి
  • సైబరాబాద్ కమిషనర్ గా అవినాశ్ మహంతి
  • రాచకొండ సీపీగా సుధీర్ బాబు

ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన రోజుల వ్యవధిలోనే రేవంత్ రెడ్డి పోలీస్ శాఖలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. ఇందులో భాగంగా ఐపీఎస్ అధికారులను ఈరోజు బదిలీ చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, సైబరాబాద్ సీపీగా అవినాశ్ మహంతి, రాచకొండ సీపీగా సుధీర్ బాబులను నియమించారు. నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ గా సందీప్ శాండిల్యను నియమించారు. త్వరలోనే భారీ స్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్ ల బదిలీలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

మరోవైపు రాచకొండ సీపీగా ఉన్న చౌహాన్, సైబరాబాద్ సీపీగా ఉన్న స్టీఫెన్ రవీంద్రలను డీజీపీ కార్యాలయానికి రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు. వీరిద్దరికీ పోస్టులు కేటాయించకపోవడం గమనార్హం. హైదరాబాద్ సీపీగా ఉన్న సందీప్ శాండిల్యను నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ గా నియమించారు.

  • Loading...

More Telugu News