Chandrababu: 'మై డియర్ ఫ్రెండ్' అంటూ... రజనీకాంత్ కు చంద్రబాబు శుభాకాంక్షలు!

Chandrababu birthday greetings to Rajinikanth
  • ఈరోజు పుట్టినరోజును జరుపుకుంటున్న రజనీకాంత్
  • రజనీ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని ఆకాంక్షించిన చంద్రబాబు
  • ప్రతి పనిలో ఆయనకు విజయం చేకూరాలని ట్వీట్

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తో టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సాన్నిహిత్యం ఉన్న సంగతి తెలిసిందే. చంద్రబాబుపై పలుమార్లు బహిరంగంగానే రజనీకాంత్ ప్రశంసలు కురిపించారు. గొప్ప నాయకుడు అని కితాబునిచ్చారు. మరోవైపు, ఈరోజు రజనీకాంత్ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తన మిత్రుడు రజనీకి సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేశారు. 'మై డియర్ ఫ్రెండ్, సూపర్ స్టార్ రజనీకాంత్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, సంతోషంగా ఉండాలి. చేపట్టిన ప్రతి పనిలో ఆయనకు విజయం చేకూరాలి' అని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా రజనీతో కలిసి ఉన్న ఫొటోను చంద్రబాబు షేర్ చేశారు.

  • Loading...

More Telugu News