Virat Kohli: 25 ఏళ్ల గూగుల్ చరిత్రలోనే కోహ్లీది అరుదైన రికార్డు!

Virat Kohli Most Searched Cricketer In Google 25 Years History
  • 25 ఏళ్ల సెర్చ్ లిస్ట్‌ను విడుదల చేసిన గూగుల్
  • క్రికెటర్లలో టాప్ ప్లేస్‌లో కోహ్లీ
  • అథ్లెట్లలో మాత్రం క్రిస్టియానో రొనాల్డోది అగ్రస్థానం
  • అత్యధికమంది శోధించిన క్రీడగా ఫుట్‌బాల్
మైదానంలో రికార్డులు కొల్లగొట్టే టీమిండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ సెర్చింజన్ దిగ్గజం గూగుల్‌లోనూ రికార్డులు బద్దలుగొట్టాడు. గూగుల్ 25 ఏళ్ల చరిత్రలోనే తొలిసారి అత్యధికమంది శోధించిన వ్యక్తిగా అత్యంత అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. గూగుల్ తన 25 ఏళ్ల చరిత్రలో అత్యధికమంది శోధించిన టాపిక్స్ జాబితాను విడుదల చేసింది. ఇందులో క్రికెటర్లలో విరాట్ అగ్రస్థానంలో నిలవగా, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ, రోహిత్‌శర్మ వంటి క్రికెటర్లు కూడా ఉన్నారు. 

అత్యధికమంది శోధించిన అథ్లెట్ల జాబితాలో మాత్రం కోహ్లీ పేరు లేకపోవడం గమనార్హం. రియల్ మాడ్రిడ్, మాంచెస్టర్ యునైటెడ్ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో అగ్రస్థానంలో ఉన్నాడు. సాకర్‌లో 15 ఏళ్లుగా ఆధిపత్యం చెలాయిస్తున్న రొనాల్డో తన ప్రధాన ప్రత్యర్థి లియోనల్ మెస్సీని కూడా ఓడించాడు. తమ తరం ఆటగాళ్లలో వీరిద్దరూ అత్యుత్తమ ఆటగాళ్లుగా చరిత్ర పుటల్లో చోటు సంపాదించుకున్నారు. ఇక్కడ ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే.. మెస్సీ కంటే కూడా రొనాల్డోకే కోహ్లీ పెద్ద ఫ్యాన్. ఈ విషయాన్ని కోహ్లీ పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. ఇక, అత్యధికమంది సెర్చ్ చేసిన క్రీడల్లో ఫుట్‌బాల్ టాప్ ప్లేస్‌లో నిలిచింది.
Virat Kohli
Google Search Engine
Cristiano Ronaldo
Football

More Telugu News