Bahawalpur Zoo: జూలోని పులి నోట్లో షూ.. పక్కనే సగం తినేసిన మనిషి మృతదేహం!

Man Found Half Eaten By Zoo Tigers In Pakistan
  • పాకిస్థాన్‌లోని బహవల్‌పూర్ జూలో ఘటన
  • ఆలస్యంగా వెలుగులోకి
  • జూను మూసేసి దర్యాప్తు ప్రారంభించిన అధికారులు
పాకిస్థాన్‌లోని బహవల్‌పూర్‌ లోని ఓ జంతు ప్రదర్శనశాలలో దారుణం జరిగింది. ఓ పులి బోనులో సగం తిన్న మనిషి శరీరాన్ని గుర్తించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు జూను మూసివేశారు. గత బుధవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రోజువారీ చెకింగ్‌లో భాగంగా జూ సిబ్బంది బుధవారం ఉదయం అన్ని ఎన్‌క్లోజర్లను చెక్ చేస్తుండగా ఓ పులి నోట్లో షూ కనిపించింది. దానిపక్కనే సగం తిన్న మనిషి శరీరాన్ని గుర్తించారు. 

అతడు ఎన్‌క్లోజర్‌లోకి దూకి పులికి ఆహారమై ఉంటాడని, మంగళవారం రాత్రే ఈ ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. పులి దాడిచేసినప్పుడు అతడు బతికే ఉండొచ్చని చెబుతున్నారు. బాధితుడిని గుర్తించాల్సి ఉంది. అతడు పులి నోటికి ఎలా చిక్కాడన్న దానిపై దర్యాప్తు జరుగుతోందని, ప్రస్తుతం జూను మూసివేశామని అధికారులు తెలిపారు.
Bahawalpur Zoo
Pakistan
Tiger

More Telugu News