Rishabh Pant: ఐపీఎల్ తో పునరాగమనం చేయనున్న పంత్

Pant returns to cricket with IPL
  • 2022 డిసెంబరులో రోడ్డు ప్రమాదంలో గాయపడిన పంత్
  • పూర్తిగా కోలుకున్న వైనం
  • ప్రస్తుతం బెంగళూరు జాతీయ క్రికెట్ అకాడమీలో ఫిట్ నెస్ కోసం కసరత్తులు

గతేడాది డిసెంబరులో ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషబ్ పంత్ పూర్తిగా కోలుకున్నాడు. ఫిట్ నెస్ ప్రమాణాలను అందుకునేందుకు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. 

కాగా, వచ్చే ఐపీఎల్ టోర్నీ ద్వారా పంత్ క్రికెట్ లో పునరాగమనం చేయనున్నారు. 2024 ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు పంత్ నాయకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలో ఉన్న పంత్ ఫిబ్రవరి చివరి నాటికి పూర్తి ఫిట్ నెస్ సాధిస్తాడని భావిస్తున్నారు. అయితే, పంత్ ఐపీఎల్ లో కేవలం బ్యాటింగ్, ఫీల్డింగ్ మాత్రమే చేయనున్నట్టు తెలుస్తోంది. బీసీసీఐ పంత్ ఫిట్ నెస్ పై ఓ అంచనాకు వచ్చి క్లియరెన్స్ ఇస్తేనే అతడు వికెట్ కీపింగ్ చేసే అవకాశాలుంటాయి.

  • Loading...

More Telugu News