Nara Brahmani: 3000 కిలో మీటర్లు పూర్తి చేసుకున్న నారా లోకేశ్ యువగళం... నారా బ్రాహ్మణి ట్వీట్

Nara Brahmani reacts to Nara Lokeshs Yuvagalam Padayatra Completing 3000 Kms
  • పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న నారా బ్రాహ్మణి
  • ఫొటోలు షేర్ చేసిన నారా బ్రాహ్మణి
  • 219 రోజుల పాటు 1915 గ్రామాల్లో పాదయాత్ర చేసిన నారా లోకేశ్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 3000 కిలో మీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ, నారా బ్రాహ్మణి, దేవాన్ష్, మోక్షజ్ఞ, బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ పాల్గొన్నారు.

 ఈ నేపథ్యంలో లోకేశ్ భార్య నారా బ్రాహ్మణి ట్విట్టర్ ద్వారా స్పందించారు. లోకేశ్ మూడువేల కిలో మీటర్ల పాదయాత్రను పూర్తి చేసుకోవడం పట్ల గర్వంగా ఉందని పేర్కొన్నారు.  ఇందుకు సంబంధించిన ఫొటోలను ఎక్స్ వేదిక ద్వారా బ్రాహ్మణి షేర్ చేశారు. కాగా, నారా లోకేశ్ 219 రోజుల్లో, పది ఉమ్మడి జిల్లాల్లో, 92 నియోజకవర్గాలు... 217 మండలాలు... 1915 గ్రామాలు... 70 బహిరంగ సభలు... 145 సమావేశాల్లో పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News