Chandrababu: కేసీఆర్ ను పరామర్శించేందుకు యశోద ఆసుపత్రికి చంద్రబాబు

Chandrababu going to hospital to meet KCR
  • కాసేపట్లో యశోద ఆసుపత్రికి చేరుకోనున్న చంద్రబాబు
  • నిన్న కేసీఆర్ ను పరామర్శించిన రేవంత్, మంత్రులు
  • కేసీఆర్ తుంటి ఎముకకు ప్లేట్లను అమర్చిన వైద్యులు
టీడీపీ అధినేత చంద్రబాబు కాసేపట్లో సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3.20 గంటలకు ఆయన ఆసుపత్రికి చేరుకుంటారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను చంద్రబాబు పరామర్శించనున్నారు. తన ఫామ్ హౌస్ లోని బాత్రూమ్ లో కాలుజారి పడిన ఘటనలో కేసీఆర్ తుంటి ఎముక విరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేసీఆర్ తుంటి ఎముకకు వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించి, స్టీల్ ప్లేట్లను అమర్చారు. ఆసుపత్రిలో ఉన్న కేసీఆర్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు కూడా పరామర్శించిన సంగతి తెలిసిందే.
Chandrababu
Telugudesam
KCR
BRS

More Telugu News