Pinarayi Vijayan: కేరళ ముఖ్యమంత్రి కాన్వాయ్‌పై షూస్ విసిరిన కేఎస్‌యూ కార్యకర్తలు.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న సీఎం

Shoes Hurled At Kerala CM Pinarayi ViJayan Convoy
  • ‘నవ కేరళ సదన్’ కార్యక్రమానికి వెళ్తుండగా ఘటన
  • వారి సమస్యేంటో అర్థం కావడం లేదన్న పినరయి విజయన్
  • ఏది ఏమైనా వారికి కఠిన శిక్షలు తప్పవని హెచ్చరిక

తన కాన్వాయ్‌పై షూస్ విసిరిన కేఎస్‌యూ కార్యకర్తలను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. కొత్తమంగళంలో జరిగిన నవ కేరళ సదస్ సమావేశంలో పాల్గొనడానికి వెళ్తున్నప్పుడు సీఎం కాన్వాయ్‌పై కేఎస్‌యూ కార్యకర్తలు షూస్ విసిరి నిరసన తెలిపారు. 

అనంతరం సదస్ సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. నవ కేరళ సదస్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేసేవారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కనమ్ రాజేంద్ర మృతితో ప్రభుత్వం పలు కార్యక్రమాలను రద్దు చేసింది. కార్యక్రమాలు తిరిగి ప్రారంభమైన కాన్వాయ్‌పై దాడి జరిగింది.

ఆందోళనలు ఇలాగే కొనసాగి కార్యక్రమాల్లో, బస్సులపై చెప్పులు, రాళ్లు విసిరేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నవ కేరళ సదస్ కార్యక్రమాలకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున వస్తున్న స్పందన చూస్తుంటే వీటి అవసరం ఏంటన్నది అర్థమవుతోందని అన్నారు. అయితే, ఇది కొంతమందికి సమస్యగా మారుతోందని, వారి ఇబ్బందికి కారణమేంటో తమకు తెలియదని పేర్కొన్నారు. అయితే, వారు కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని పినరయి విజయన్ హెచ్చరించారు.

  • Loading...

More Telugu News