Samantha: కొత్త బిజినెస్ లోకి ఎంటర్ అయిన సమంత

Actress Samantha starts her own film production house Tralala Moving Pictures
  • సినీ నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన సమంత
  • ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో సొంత ప్రొడక్షన్ హౌస్
  • కొత్త ఆలోచనలు, కంటెంట్ ను ప్రోత్సహిస్తామని వెల్లడి

ప్రముఖ సినీ నటి సమంత ప్రస్తుతం తన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే క్రమంలో సినిమాలకు దూరంగా ఉంటూ రెస్ట్ తీసుకుంటున్నారు. అయినప్పటికీ ఆమె జోరు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఆమె సినీ నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. ఈ విషయాన్ని నిన్న ఆమె అధికారికంగా ప్రకటించారు. 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్' పేరుతో ఆమె తన సొంత ప్రొడక్షన్ హౌస్ ని ప్రారంభించారు. తనకు ఎంతో ఇష్టమైన ఇంగ్లీష్ పాప్ సాంగ్ 'బ్రౌన్ గర్ల్ ఇన్ ది రింగ్' స్ఫూర్తితో తన ప్రొడక్షన్ హౌస్ కి ఈ పేరు పెట్టినట్టు ఆమె వెల్లడించారు. 


తన నిర్మాణ సంస్థ ద్వారా కొత్త తరం ఆలోచలను ప్రోత్సహిస్తానని సమంత తెలిపారు. కొత్త ఆలోచనలను, కంటెంట్ ను ఎంకరేజ్ చేస్తానని చెప్పారు. అర్థవంతమైన, యూనివర్సల్ కథలను తెరకెక్కిస్తామని తెలిపారు. సమాజంలోని సంక్లిష్టతలు, బలాలను ప్రజలకు తెలియజేసే విధంగా తమ సినిమాలు తెరకెక్కుతాయని చెప్పారు. 

  • Loading...

More Telugu News