Rain: ఒక్క బంతి పడకుండానే టీమిండియా-దక్షిణాఫ్రికా తొలి టీ20 రద్దు

Rain plays spoil sport as 1st T20 between Team India and South Africa abandoned
  • డర్బన్ లో ఎడతెరిపిలేని వర్షం
  • తడిసి ముద్దయిన కింగ్స్ మీడ్ స్టేడియం
  • కనీసం టాస్ కు కూడా అవకాశం ఇవ్వని వరుణుడు
  • ఇరు జట్ల మధ్య డిసెంబరు 12న రెండో టీ20

టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ కు వాన పోటు తగిలింది. ఈ మ్యాచ్ కు వేదికైన డర్బన్ లో ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో మ్యాచ్ ను రద్దు చేశారు. ఇక్కడి కింగ్స్ మీడ్ స్టేడియం వర్షం కారణంగా తడిసి ముద్దవడంతో కనీసం టాస్ కూడా సాధ్యం కాలేదు. వర్షం తగ్గితే కనీసం ఓవర్లు తగ్గించయినా మ్యాచ్ జరపాలని భావించారు. మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు, ఎంతకీ వాన తగ్గకపోవడంతో మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాదని తేల్చారు. ఇక, ఇరు జట్ల మధ్య రెండో టీ20 డిసెంబరు 12న కెబెరాలో జరగనుంది.

  • Loading...

More Telugu News