Revanth Reddy: రాష్ట్రంలో వివిధ కార్పొరేషన్ల చైర్మన్ల నియామకాన్ని రద్దు చేసిన రేవంత్ సర్కారు

Telangana govt cancels appointment of variuos corpoprations chairpersons
  • తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ సర్కారు
  • తనదైన మార్కు పాలనతో దూసుకెళుతున్న రేవంత్
  • తాజాగా 54 కార్పొరేషన్ల చైర్మన్ల నియామకం రద్దు
  • ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ శాంతికుమారి
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించగా, ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 54 కార్పొరేషన్ల చైర్మన్ల నియామకాలను రద్దు చేసింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వ తాజా నిర్ణయంతో పదవులు కోల్పోయిన వారిలో ఆకుల లలిత, అల్లం నారాయణ, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, గెల్లు శ్రీనివాస్, జూలూరి గౌరీశంకర్, తాటికొండ రాజయ్య, సోమా భరత్ కుమార్, పల్లె రవికుమార్ తదితరులు ఉన్నారు. త్వరలోనే ఆయా కార్పొరేషన్లకు చైర్మన్లు, చైర్ పర్సన్లను నియమించే అవకాశాలున్నాయి.
Revanth Reddy
Corporations
Chairpersons
Congress
Telangana

More Telugu News