Samantha: ప్రత్యూష ఫౌండేషన్ చిన్నారుల కోసం 'హాయ్ నాన్న' చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేసిన సమంత

Samantha hosts special screening of Hi Nanna for Pratyusha Foundation girls
  • నాని, మృణాల్ ఠాకూర్ జంటగా 'హాయ్ నాన్న' చిత్రం
  • ఇటీవలే రిలీజ్
  • నేడు హైదరాబాద్ ఏఎంబీ సినిమాస్ లో స్పెషల్ స్క్రీనింగ్
  • బాలికలతో కలిసి సందడి చేసిన సమంత

నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్, బేబీ కియారా ఖన్నా ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం 'హాయ్ నాన్న'. ఈ చిత్రానికి శౌర్యువ్ దర్శకుడు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కాగా, సామాజిక సేవా కార్యక్రమాలతోనూ ఎంతో గుర్తింపు సంపాదించుకున్న నటి సమంత చిన్నారుల కోసం 'హాయ్ నాన్న' చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు. 

మహిళా సాధికారత కోసం కృషి చేసే ప్రత్యూష ఫౌండేషన్ లో ఆశ్రయం పొందుతున్న బాలికల కోసం హైదరాబాదులోని ఏఎంబీ సినిమాస్ లో 'హాయ్ నాన్న' ప్రదర్శించారు. ఈ స్పెషల్ స్క్రీనింగ్ కు సమంత కూడా హాజరై, ప్రత్యూష ఫౌండేషన్ బాలికల్లో ఉత్సాహం నింపారు. వారితో ఆప్యాయంగా మాట్లాడి సంతోషం కలిగించారు.

  • Loading...

More Telugu News