Jason Momoa: నేటి నుంచి దక్షిణాఫ్రికాతో సిరీస్... టీమిండియాను ఎంకరేజ్ చేస్తున్న 'ఆక్వామ్యాన్' హీరో... వీడియో ఇదిగో!

Aquaman hero Jason Momoa encourages Team India in South Africa tour
  • నేటి నుంచి దక్షిణాఫ్రికాలో టీమిండియా టూర్
  • నేడు తొలి టీ20
  • జాసన్ మోమోవాతో ప్రోమో రూపొందించిన స్టార్ స్పోర్ట్స్
హాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రం ఆక్వామ్యాన్ చూసిన వారికి అందులో ఆరడుగులకు పైగా ఎత్తు ఉండే హీరో జాసన్ మోమోవా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిజంగా ఆక్వామ్యాన్ అంటే ఇలాగే ఉంటాడా అనిపించేలా జాసన్ మోమోవా తన నటనా ప్రతిభను చాటుకున్నాడు. 

కాగా, ఇప్పుడీ అమెరికన్ నటుడు క్రికెట్ కు ప్రచారం చేస్తుండడం విశేషం. నేటి నుంచి దక్షిణాఫ్రికాలో టీమిండియా పర్యటన కొనసాగనుండగా, టీమిండియాను ఎంకరేజ్ చేస్తూ రూపొందించిన ప్రోమో వీడియోలో జాసన్ మోమోవా దర్శనమిచ్చాడు. సూపర్ హీరో కావాలంటే ఏం చేయాలి? అంటూ మోమోవా వ్యాఖ్యానంతో ఈ ప్రోమో మొదలవుతుంది. ధైర్యంగా నిలబడి పోరాడేవాడే సూపర్ హీరో అవుతాడు అంటూ మోమోవా చెప్పడాన్ని ఈ వీడియోలో చూడొచ్చు. ఈ ప్రోమో వీడియోను స్టార్ స్పోర్ట్స్ చానల్ రూపొందించింది.
Jason Momoa
Aquaman
Team India
South Africa
Star Sports

More Telugu News