Etela Rajender: లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలోని అన్ని స్థానాల్లోనూ గెలుస్తుంది!: ఈటల రాజేందర్

Etala Rajender hopes bjp government will form government in Telangana
  • అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి ఓటింగ్ శాతం, సీట్లు పెరిగాయన్న ఈటల
  • ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించామన్న ఈటల
  • లోక్ సభ ఎన్నికల్లో 400 సీట్లు గెలుస్తామని ధీమా
రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అన్ని స్థానాలను గెలుచుకుంటుందని ఆ పార్టీ నేత ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి సీట్లు, ఓటింగ్ శాతం భారీగా పెరిగాయని గుర్తు చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ అద్భుత విజయం సాధించిందని ఆనందం వ్యక్తం చేశారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచామన్నారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా 400 స్థానాల్లో విజయం సాధిస్తుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తాము తెలంగాణలోని అన్ని స్థానాలను గెలవడంతో పాటు తెలంగాణలో రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని జోస్యం చెప్పారు.
Etela Rajender
Telangana
Telangana Assembly Results
BJP

More Telugu News