Thandel: హైదరాబాదులో ఘనంగా నాగచైతన్య 'తండేల్' ప్రారంభం 

Naga Chaitanya and Sai Pallavi starring Thandel movie has bebun
  • నాగచైతన్య, సాయిపల్లవి జంటగా తండేల్
  • చందూ మొండేటి దర్శకత్వంలో చిత్రం
  • అన్నపూర్ణ స్టూడియోస్ లో ముహూర్తం షాట్
  • కెమెరా స్విచాన్ చేసిన నాగార్జున... క్లాప్ కొట్టిన వెంకటేశ్
యువ హీరో అక్కినేని నాగచైతన్య కొత్త చిత్రం 'తండేల్' నేడు హైదరాబాదులో లాంఛనంగా ప్రారంభమైంది. అన్నపూర్ణ స్టూడియోస్ లోని గ్లాస్ హౌస్ లో ముహూర్తం షాట్ చిత్రీకరించారు. అక్కినేని నాగార్జున కెమెరా స్విచాన్ చేయగా... నాగచైతన్య, సాయిపల్లవిలపై చిత్రీకరించిన ఓపెనింగ్ షాట్ కు విక్టరీ వెంకటేశ్ క్లాప్ కొట్టారు. ఈ కార్యక్రమంలో గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ కూడా పాల్గొన్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'తండేల్' చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో నాగచైతన్య మత్స్యకారుల నాయకుడిగా కనిపించనున్నాడు.
Thandel
Naga Chaitanya
Sai Pallavi
Opening
Chandu Mondeti
Nagarjuna
Venkatesh
Annapurna Studios
Hyderabad
Tollywood

More Telugu News