Akbaruddin Owaisi: ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణస్వీకారం

Akbaruddin Owaisi takes oath as protem Speaker of Telangana Assembly
  • నేడు రాజ్‌భవన్‌లో కార్యక్రమం
  • అక్బరుద్దీన్ తో ప్రమాణం చేయించిన గవర్నర్ తమిళిసై
  • కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి హాజరు

తెలంగాణ మూడో శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం రాజ్‌భవన్‌‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ తమిళసై ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌తో ప్రమాణం చేయించారు. అల్లా సాక్షిగా అక్బరుద్దీన్ తన బాధ్యతలు నిర్వహిస్తానంటూ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. మంత్రులు డి.శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీశ్ రావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఆర్టికల్ 178 ప్రకారం శాసనసభ కొత్త స్పీకర్‌ను ఎన్నుకునే వరకూ ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ సేవలందిస్తారంటూ గవర్నర్ ఓ నోటిఫికేషన్ విడుదల చేశారు. అసెంబ్లీలో అందరికంటే సీనియర్ సభ్యుడు కావడంతో అక్బరుద్దీన్‌కు ప్రొటెం స్పీకర్ బాధ్యతలు దక్కాయి. నేడు జరగనున్న శాసనసభ తొలి సమావేశంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణస్వీకారం చేయిస్తారు.

  • Loading...

More Telugu News