G. Kishan Reddy: రేపు బీజేపీ ఎమ్మెల్యేలతో కిషన్ రెడ్డి భేటీ

BJP Kishan Reddy to meet MLAs
  • తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి 8 మంది విజయం
  • రేపు ఉదయం బీజేపీ కార్యాలయంలో ఎమ్మెల్యేలతో కిషన్ రెడ్డి భేటీ
  • ప్రొటెం స్పీకర్‌గా అక్బర్... అసెంబ్లీ సమావేశాలకు బీజేపీ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యే అవకాశం!

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి... రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేలతో శనివారం ఉదయం భేటీ కానున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. రేపు ఉదయం ఏడున్నర గంటలకు బీజేపీ కార్యాలయంలో వీరితో కిషన్ రెడ్డి సమావేశమవుతున్నారు. అనంతరం ఎమ్మెల్యేలు అందరూ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్నారు. కాగా బీజేపీ ఎమ్మెల్యేలు రేపటి అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఓవైసీ వ్యవహరించనున్న నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యేలు... ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉండనున్నారు. ఇప్పటికే గోషామహల్ నుంచి గెలిచిన రాజాసింగ్ ఈ మేరకు ప్రకటన చేశారు.

  • Loading...

More Telugu News